Site icon HashtagU Telugu

Kumari Aunty : నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా కుమారి ఆంటీ స్టోరీ..!

Sundeep Kishan Kumari

Sundeep Kishan Kumari

Kumari Aunty గుంటూరు నుంచి వచ్చి మాదార్ పూర్ లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ నడుపుతున్న దాసరి సాయి కుమారి అదేనండి కుమారి ఆంటీ అంటే ఎవరో సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె అందిస్తున్న టేస్టీ ఫుడ్ వల్ల సెలబ్రిటీస్ సైతం ఆమె దగ్గరకు వచ్చి కర్రీస్ తీసుకెళ్లడం.. మీల్స్ పార్సిల్స్ తీసుకోవడం జరుగుతుంది. కేవలం ఫుడ్ పెట్టడమే కాకుండా అక్కడకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించడం ఆమె మంచితనాన్ని తెలియచేస్తుంది.

అల సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ ని మూయించాలని ట్రై చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్స్ తో ఆమె ఫుడ్ స్టాల్ జోలికి ఎవరు వెళ్లలేదు. ఇదిలాఉంటే సోషల్ మీడియాలో ఆమె గురించి చర్చ ఒక రేజ్ లో జరుగుతుండగా ఇప్పుడు కుమారి ఆంటీపై నెట్ ఫ్లిక్స్ కూడా కన్నేసిందని తెలుస్తుంది.

నెట్ ఫ్లిక్స్ లో కుమారి ఆంటీ పై 3 ఎపిసోడ్ ల ఒక డాక్యుమెంటరీ ప్లానింగ్ లో ఉందట. ఆమె కెరీర్ ఎలా మొదలైంది. అసలు ఆమె హైదరాబాద్ జర్నీ ఎలా సాగింది. ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంటరీలో మెన్షన్ చేస్తారని తెలుస్తుంది. మరి ఈ డాక్యుమెంటరీ ఎవరు డైరెక్ట్ చేస్తారు. అసలు నిజంగానే కుమారి ఆంటీ డాక్యుమెంటరీ తీస్తున్నారా లేదా లాంటి విషయాలపై త్వరలో క్లారిటీ వస్తుంది.

ఏది ఏమైనా కుమారి ఆంటీ ఈ రేంజ్ లో పాపులర్ అవ్వడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. సోషల్ మీడియా వల్ల ఆమె సూపర్ క్రేజ్ తెచ్చుకోగా దాని వల్లే కొంత ఇబ్బంది కూడా జరిగింది. అయితే ఫైనల్ గా ఆమె గురించి సీఎం కూడా స్పందించాడంటే ఆమె రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.