Rajamouli Mahesh Movie : రాజమౌళి మహేష్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఇన్వెస్ట్మెంట్..?

Rajamouli Mahesh Movie రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అయితే సినిమాలో హాలీవుడ్ నిర్మాణ సంస్థ

Published By: HashtagU Telugu Desk
Mahesh Rajamouli Update will come on Birthday

Mahesh Rajamouli Update will come on Birthday

Rajamouli Mahesh Movie రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అయితే సినిమాలో హాలీవుడ్ నిర్మాణ సంస్థ భాగస్వామ్యం అవుతుందని టాక్. అంతేకాదు సినిమా లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ నర్ గా చేరుతుందని టాక్. ఆర్.ఆర్.ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి మహేష్ తో చేస్తున్న సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో భాగం అవ్వాలని బడా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా నెట్ ఫ్లిక్స్ కూడా ఈ సినిమాతో కొలాబరేట్ అవ్వాలని ప్రయత్నిస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రిలీజ్ రైట్స్ కు భారీ మొత్తాన్ని ముందే ఇచ్చి సినిమా నిర్మాణానికి సపోర్ట్ చేయాలని అనుకుంటుంది.

ఓ విధంగా ఇది భారీ డీల్ అని చెప్పొచ్చు. మహేష్ రాజమౌళి ఇద్దరు కలిసి చేసే ఈ సినిమా ఇంటర్నేషనల్ అప్పీల్ ఉంటుందని తెలుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉంటుందట. సినిమాలో మహేష్ లుక్ కూడా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.

మహేష్ రాజమౌళి ఈ కాంబో సినిమా అనగానే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన వర్క్ షాప్ మొదలు పెడతారని తెలుస్తుంది.

Also Read : Pushpa 3 : పుష్ప 3 అఫీషియల్ గా చెప్పేసిన అల్లు అర్జున్.. పుష్ప ఫ్రాంచైజ్ కొనసాగుతుంది..!

  Last Updated: 17 Feb 2024, 07:25 AM IST