Kalki: కల్కి మూవీ రైట్స్ కోసం యుద్ధం చేస్తున్న ఓటీటీ సంస్థలు.. ఎన్ని కోట్లో తెలుసా?

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 09:42 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న తెలిసిందే. ఇటీవల సలార్ మూవితో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజాసాబ్ వంటి సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్. ఇకపోతే కల్కి సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఇది ఇలా ఉంటే ఓటిటి రైట్స్ కోసం కొన్ని సంస్థల మధ్య యుద్ధం జరుగుతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

మరి ఆ వివరాల్లోకి వెళితే.. మాములుగా క్రేజ్ ఉన్న సినిమా ఓటిటి రైట్స్ తమ దగ్గర ఉండాలని ప్రతీ ఓటీటీ సంస్దకు ఉంటుంది. అందుకోసం ఎంత పెద్ద మొత్తం అయినా వెచ్చించటానికి రెడీ అవుతూ ఉంటాయి. అందులోనూ ఓటిటి సంస్దల మధ్య పోటీ విపరీతంగా ఉన్న ఈ పరిస్దితుల్లో ఏ అవకాసం మిస్ చేసుకోదలుచుకోవటం లేదు ఈ సంస్దలు. సినిమా ప్రారంభం నుంచి ఆ నిర్మాతల చుట్టూ తిరుగుతూ ప్రదక్షణాలు చేస్తున్నారు నిర్మాతలు. అలాగే ఇప్పుడు ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం కల్కి రైట్స్ కోసం రెండు OTT సంస్దల మధ్య యుద్దం మొదలైందని సమాచారం.

మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విలన్ గా కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రం ఓటిటి రైట్స్ కోసం ఓ రేంజిలో డిమాండ్ క్రియేట్ అయ్యింది. Netflix, ప్రైమ్ వీడియో వారు ఈ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఎంత రేటు అయినా పెట్టడానికి సై అంటున్నారు. వేలం పాటలాగ ఈ రైట్స్ రేటు ను ఈ రెండు సంస్దలు పెంచుకుంటూ పోతున్నాయని తెలుస్తోంది. అయితే నిర్మాతలు కూడా ఈ రైట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారని, అన్ని రకాలుగా చూసుకునే డీల్ క్లోజ్ చేయబోతున్నారట. ఇక ఈ చిత్రం ఓటిటి రైట్స్ 200 కోట్లు దాకా పలుకుతున్నాయని, డిజిటల్ మార్కెట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ కాబోతోందని చెప్తున్నారు. ఈ రైట్స్ విషయంలో అశ్వనీదత్ బడ్జెట్ ని బేరేజు చేసుకుని దిగుతున్నారట. అలాగే ఈ రైట్స్ లో కొంత భాగం రెమ్యునరేషన్ గా ప్రభాస్ కు వెళ్లనుందట. అందుకే ఈ రెండు ఓటిటి సంస్దలలో ఏది ఎక్కువ కోట్ చేస్తే అటు ఎగ్రిమెంట్ అవుతుందని చెప్పుకుంటున్నారు.