Site icon HashtagU Telugu

Adipurush: నేపాల్‌లో ఆదిపురుష్‌ సినిమాపై వివాదం.. మార్నింగ్‌ షోలు నిలిపివేత..?

Adipurush

Prabhas Adipurush Movie gets clean U Certificate and run time locked

Adipurush: భారతీయ చిత్రం ఆదిపురుష్‌ (Adipurush)పై నేపాల్‌ (Nepal)లో కలకలం మొదలైంది. సినిమాలో సీతమ్మ పాత్ర గురించి నేపాల్ తీవ్రమైన ప్రశ్న లేవనెత్తింది. సీతకు సంబంధించిన వివాదాస్పద భాగాలను తొలగించకుంటే నేపాల్‌లో సినిమాను నిషేధిస్తామని నేపాల్ మేయర్ హెచ్చరించారు. నేపాల్ రాజధాని ఖాట్మండు తదితర ప్రాంతాల్లో సినిమా ప్రదర్శనను నిషేధిస్తామన్నారు. ఈ సినిమాపై నేపాల్ తొలిసారిగా వ్యతిరేకత వ్యక్తం చేసింది.

నేపాల్‌లో ఆదిపురుష్‌ సినిమాపై వివాదం తలెత్తింది. సీత భారత్‌లో జన్మించినట్లు చూపడంపై ఆ దేశ సెన్సార్‌ బోర్డు అభ్యంతరం తెలిపింది. సీత నేపాల్‌లో జన్మించారని, దీనిని సవరించకుంటే విడుదలకు అనుమతినివ్వమని స్పష్టం చేసింది. అటు ఈ డైలాగ్‌ తీసేయకుంటే భారత సినిమాలు నిలిపేస్తామని పలువురు నేపాల్‌ నేతలు మండిపడ్డారు. దీంతో డైలాగ్‌ తొలగించడంతో అక్కడ రిలీజ్‌కు లైన్‌ క్లియరైంది. కానీ మార్నింగ్‌ షోలు నిలిపివేసినట్లు సమాచారం.

Also Read: Anjali ‘Bahishkarana’: వైవిధ్యమైన పాత్రలో అంజలి.. బహిష్కరణ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా గురువారం నాడు నేపాల్ రాజధానిలో హిందీ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించారు. ఇతిహాసం రామాయణం ఆధారంగా “ఆదిపురుష్” నుండి డైలాగ్‌లో కొంత భాగాన్ని మార్పులు చేసేందుకు మేయర్ మూడు రోజుల గడువు ఇచ్చారు.

నేపాల్ అభ్యంతరం

సీతమ్మను భారతదేశపు కుమార్తెగా పిలవడంపై బాలేంద్ర షా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భాగాన్ని సినిమా నుంచి తొలగించాలని అంటున్నారు. అతను ఫేస్‌బుక్‌లో ఇలా రాశాడు. “నేపాల్, భారతదేశంలో దక్షిణ భారత చిత్రం ‘ఆదిపురుష్’లో ఉన్న ‘జానకీ భారత్ కీ బేటీ హై’ లైన్ తొలగించే వరకు ఖాట్మండు మహానగరంలో ఏ హిందీ చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతించబడదు. శుక్రవారం నుంచి నేపాల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అయితే సీతను భారత పుత్రికగా అభివర్ణించే డైలాగ్‌ను తొలగించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతి ఇచ్చామని నేపాల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు తెలిపింది.