Site icon HashtagU Telugu

Tollywood : ‘నేను మీకు తెలుసా’ డైరెక్టర్ మృతి

Director Ajay Dies

Director Ajay Dies

తెలుగు చిత్రసీమ(Tollywood)లో మరో విషాదం చోటుచేసుకుంది. ‘నేను మీకు తెలుసా’ (Nenu Meeku Telusa) మూవీ దర్శకుడు అజయ్ (Director Ajay Shastri) కన్నుమూశాడు. మనోజ్ మంచు, స్నేహ ఉల్లాల్, రియా సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ.. 2008 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం తో అజయ్ వెండితెరకు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. అంతకు ముందు KAD మూవీస్ మరియు రానా దగ్గుబాటి నిర్మించిన “12” (బారా) అనే షార్ట్ ఫిల్మ్‌తో అతని ప్రయాణం ప్రారంభమైంది.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో అజయ్ రాఖీ మరియు డేంజర్ వంటి సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ మరియు స్క్రీన్ ప్లే రైటర్ పాత్రను పోషించాడు. ‘నేను మీకు తెలుసా’ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం తో మరో ఛాన్స్ రాలేదు. తాజాగా ఈయన మరణించినట్లు హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘నా బెస్ట్ ఫ్రెండ్ అజయ్ ఇక లేరు. ఈ విషయం చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. చాలా త్వరగా వెళ్లిపోయావు అజయ్. నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఇది ఒక కల కావాలని కోరుకుంటున్నా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా బాబాయ్’ అని మనోజ్ Xలో ఎమోషనల్ ట్వీట్ చేశారు. మరి అజయ్ మృతికి కారణాలు ఏంటి అనేది వెల్లడించలేదు.

Read Also : Kangana On Rahul: రాహుల్ అర్ధం లేని మాటలు: కంగనా