Vijay – Mahesh Babu : విజయ్, మహేష్‌తో సినిమా చేస్తానంటున్న తమిళ్ దర్శకుడు..

విజయ్, మహేష్‌తో ఓ సినిమా చేస్తానంటున్న తమిళ్ దర్శకుడు నెల్సన్. ఇక ఈ కామెంట్స్ విన్న కామన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Nelson Dilipkumar Said He Will Do Movie With Vijay Mahesh Babu Shah Rukh Khan

Nelson Dilipkumar Said He Will Do Movie With Vijay Mahesh Babu Shah Rukh Khan

Vijay – Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ కి తమతమ ఇండస్ట్రీలో సూపర్ ఫాలోయింగ్ తో పాటు.. ఇద్దరికీ మంచి కామన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక ఈ కామన్ ఫ్యాన్స్ కి ఈ ఇద్దర్ని ఒకే స్క్రీన్ పై చూడాలని ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది. ఈ కోరిక ఒక చిన్న సీన్ తో అయినా నెరవేరితే బాగుండని ఆ ఫ్యాన్స్ అంత ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఆశల పై ప్రముఖ తమిళ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్ చేసారు.

గత ఏడాది రజినీకాంత్ తో ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన నెల్సన్ ఈ కామెంట్స్ చేసారు. ఈ దర్శకుడు విజయ్ తో ‘బీస్ట్’ వంటి హిట్ బొమ్మని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ దర్శకుడు, విజయ్ తో మరో సినిమాని కూడా చేస్తానంటూ ఇప్పటికే చెప్పుకొచ్చారు. కాగా జైలర్ సినిమాలో రజినీకాంత్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ని కూడా నెల్సన్ పవర్ ఫుల్ గా చూపించిన సంగతి తెలిసిందే.

ఈక్రమంలోనే విజయ్ తో చేయబోయే సినిమాలో కూడా.. ఇలా ఇతర హీరోలను చూపించబోతున్నారా..? అని నెల్సన్ రీసెంట్ గా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో ప్రశ్నించారు. దీనికి నెల్సన్ బదులిస్తూ.. మహేష్ బాబుని విజయ్ సినిమాలో తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు. అలాగే మమ్ముట్టి, షారుఖ్ ని కూడా ఆ సినిమాలో కాస్ట్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఈ కామెంట్స్ విన్న మహేష్, విజయ్ కామన్ ఫ్యాన్స్.. ఈ కామెంట్స్ నిజమైతే బాగుండని ఫీల్ అవుతున్నారు. మరి నెల్సన్ తన మాటలని నిజం చేస్తారో లేదో చూడాలి. కాగా విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమా చేస్తున్నారు.

Also read : Varun Tej : బాబాయ్ కోసం రంగంలోకి దిగుతున్న మెగా హీరో

  Last Updated: 26 Apr 2024, 04:36 PM IST