డీజే టిల్లు సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ నేహా శెట్టి తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. డీజే టిల్లులో ఆమె చేసిన రాధిక పాత్ర ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే డీజే టిల్లు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ లో కూడా ఆమెను తీసుకున్నారు. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఆమె హీరోయిన్ గా నటించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఆ సినిమా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
ఐతే చేస్తున్న సినిమాలేవి కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోవడంతో నేహా శెట్టికి కాస్త అవకాశాలు తగ్గాయి. ఐతే ఈ టైం లో పవర్ స్టార్ సినిమా ఛాన్స్ వచ్చింది. అది కూడా పవన్ (Pawan Kalyan) నటిస్తున్న క్రేజీ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. పవర్ స్టార్ ఛాన్స్ అంటే ఎవరైనా కాదంటారా చెప్పండి. వెంటనే అమ్మడు ఎగిరిగంతేసేలా చేస్తూ ఓకే చెప్పిందని తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న సినిమా ఓజీ (OG). కలకత్తా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం నేహా శెట్టి (Neha Shetty)ని ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే అది జస్ట్ ఒక సాంగ్ లాగా కాకుండా కాన్సెప్ట్ ఫుల్ గా అదిరిపోతుందని అంటున్నారు. నేహా శెట్టికి కచ్చితంగా ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చేలా చేస్తుందని అంటున్నారు.
Also Read : Virat Kohli : విరాట్ కోహ్లీకి మెల్బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాపై అసహనం