Site icon HashtagU Telugu

Neha Shetty : టిల్లు స్క్వేర్‌లో ‘రాధిక’ని ఎందుకు తీసుకోలేదు? క్లారిటీ ఇచ్చిన నేహశెట్టి..

Neha Shetty Reacts on Tillu Square Movie for not hiring her as Heroine

Neha Shetty Reacts on Tillu Square Movie for not hiring her as Heroine

సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), నేహా శెట్టి(Neha Shetty) జంటగా తెరకెక్కిన డీజే టిల్లు(DJ Tillu) సినిమా భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. ఈ సినిమాలో నేహా శెట్టి చేసిన రాధిక క్యారెక్టర్ బాగా వైరల్ అయింది. అప్పట్నుంచి నేహశెట్టిని అందరూ రాధిక అనే పిలుస్తున్నారు. డీజే టిల్లు సూపర్ హిట్టవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. టిల్లు స్క్వేర్(Tillu Square) పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

అయితే టిల్లు స్క్వేర్ లో మాత్రం హీరోయిన్ ని మార్చేశారు. డీజే టిల్లులో ఉన్న నేహశెట్టిని తీసుకోకుండా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారు. ఈ విషయంలో మాత్రం అభిమానులు నిరాశకు గురయ్యారు. రాధిక క్యారెక్టర్ వల్లే డీజే టిల్లు సినిమా హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ లో ఆమెని పక్కన పెట్టేశారు అని కామెంట్స్ చేశారు. తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాలో తనని తీసుకోకపోవడంపై నేహశెట్టి స్పందించింది. రూల్స్ రంజన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నేహశెట్టి దీని గురించి మాట్లాడింది.

నేహశెట్టి మాట్లాడుతూ.. డీజే టిల్లు సినిమాలోని రాధిక పాత్రతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. టిల్లు స్క్వేర్ సినిమా విషయంలో మూవీ యూనిట్ మొదటి నుంచి క్లారిటీగా ఉన్నారు. డీజే టిల్లు సినిమాకు ఇది కొనసాగింపు కాదు. ఇది ఇంకో కొత్త కథ. అందుకే నన్ను హీరోయిన్ గా తీసుకోలేదు. ఆ కథకి, ఈ కథకి సంబంధం లేదు అందుకే కంటిన్యూ క్యారెక్టర్ ఉండదు కాబట్టే నన్ను తీసుకోలేదు. కానీ ఈ విషయంలో చాలా మంది నిరాశకు గురయ్యారు. నన్ను వెళ్లి మూవీ యూనిట్ ని అడగమని కొంతమంది మెసేజ్ లు కూడా చేశారు అని తెలిపింది.

 

Also Read : The Deserving: టాలీవుడ్ ప్రతిభతో తొలి హాలివుడ్ మూవీ “ది డిజర్వింగ్”