Site icon HashtagU Telugu

Naatu Naatu: నీతూ కపూర్ నాటు నాటు : వీడియో వైరల్

Natu Natu

New Web Story Copy (70)

Naatu Naatu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ దక్కాయి. ఈ ఏడాది మార్చిలో ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను కూడా గెలుచుకుంది.

ఈ మాస్ పాటకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మాస్ మసాలా మ్యూజిక్ కి అంతే మాస్ డ్యాన్స్ తోడవ్వడంతో పాట ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. ఈ పాటకు సామాన్యులే కాదు సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. నాటు నాటు పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. తాజాగా అలియా భట్ అత్తగారు మరియు బాలీవుడ్ నటి నీతూ కపూర్ తన 64 ఏళ్ల వయసులో తన స్నేహితురాలు మరియు బాలీవుడ్ నటి పద్మిని కొల్హాపురేతో కలిసి నాటు-నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు తన అన్నయ్య ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ చిత్రంతో తెలుగు సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. బాలీవుడ్ ట్రాక్ దాటేసి హాలీవుడ్ స్థాయిలో అదరగొట్టింది.ఇక సినిమాలోని పాటకు ఆస్కార్ రావడంతో ఇండియన్ సినిమా హాలీవుడ్ స్క్రీన్ పై మెరిసింది.

Read More: Uganda: మంత్రిని కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డ్

Exit mobile version