Site icon HashtagU Telugu

Neel All Films: ప్రశాంత్ నీల్ ‘రొటీన్’ ఫార్ములా!

Neel

Neel

కథలను తెరకెక్కించడంలో ఒక్కొ దర్శకుడిది ఒక్కో స్టయిల్. ఒకరు కమర్షియల్ ఎంటర్ టైన్స్ మెంట్స్ అందించడంలో సక్సెస్ అయితే.. మరొకరు కల్పిత కథలతో హిట్స్ కొడుతుంటారు. కథా ఏదైనా హిట్స్ కొట్టడమే ధ్యేయంగా డైరెక్షన్ చేస్తుంటారు. అయితే ఇటీవల విడుదలైన కేజీఎఫ్-2 ఎలాంటి సంచనాలు రేపిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వెయ్యి కోట్ల వసూళ్లను సైతం సాధించింది. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ హీరో యష్ ను ఏవిధంగా ప్రజెంట్ చేశాడో.. తన తదుపరి హీరోలను కూడా అదే మాదిరిగా చూపించబోతున్నాడు.

“కెజీఎఫ్” సినిమాలతో ప్రశాంత్ డార్క్ థీమ్ ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు. ప్రభాస్ “సాలార్” ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా అదే కేజీఎఫ్ తరహాలో డార్క్ థీమ్ ఉన్నట్టు స్పష్టమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..  ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ (#NTR31) కూడా రొటీన్ ఫార్ములానే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఆయన సినిమాల్లోని హీరోలంతా శక్తివంతంగా కనిపిస్తారు.  “కేజీఎఫ్ 2”లో యష్, “సాలార్”లో ప్రభాస్, “ఎన్టీఆర్ 31”లో ఎన్టీఆర్ దాదాపుగా ఒకేలా కనిపిస్తున్నారు. ఇది అతని సిగ్నేచర్ స్టైలా లేక సక్సెస్ ఫార్ములాలో ఇరుక్కుపోయాడా? అని అభిమానులు చర్చించుంటకున్నారు. “ఎన్టీఆర్ 31” విడుదలయ్యే వరకు “కెజిఎఫ్ 3” తీయనని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు.

Exit mobile version