Naga Chaitanya : ఆఖరి నిమిషంలో హీరోయిన్ మారిందా..?

అక్కినేని హీరో నాగ చైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో నాగ చైతన్య 23వ సినిమాగా భారీ మూవీ ప్లాన్

Published By: HashtagU Telugu Desk
Nc23 Heroine Changed In Las

Nc23 Heroine Changed In Las

అక్కినేని హీరో నాగ చైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో నాగ చైతన్య 23వ సినిమాగా భారీ మూవీ ప్లాన్ చేశారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా రానుంది. ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మ్యాన్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా సాయి పల్లవిని ఫైనల్ గా ఫిక్స్ చేశారు. అయితే సాయి పల్లవి డెశిషన్ ఆఖరి నిమిషం లో జరిగిందని టాక్.

ముందు ఈ సినిమాలో సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరిలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆల్రెడీ నాగ చైతన్య (Naga Chaitanya) సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా చేసింది. కీర్తి సురేష్ మాత్రం మహానటిలో ఏదో ఒకటి రెండు సీన్స్ చేసింది. చందు మొండేటి సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా వెయిట్ ఉందని తెలుస్తుంది. అందుకే ఈ వెయిట్ ఉన్న పాత్రకు అయితే మహానటి లేదా సహజనటి నటించాలని అనుకున్నారు.

కీర్తి సురేష్ నే దాదాపు కన్ఫర్మ్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. కీర్తి సురేష్ డేట్స్ విషయంలో క్లాష్ రావడంతో చివరి నిమిషం లో ఈ ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవిని తీసుకున్నారని తెలుస్తుంది. సాయి పల్లవితో ఆల్రెడీ లవ్ స్టోరీ హిట్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో కూడా ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు.

లాస్ట్ ఇయర్ విరాటపర్వం, గార్గి సినిమాల తర్వాత సాయి పల్లవి చాలా టైం తీసుకుంది. అసలు అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది కానీ నాగ చైతన్య (Naga Chaitanya) చందు కాంబో సినిమాకు సైన్ చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది సాయి పల్లవి. మరి ఈ సినిమాలో సాయి పల్లవిని ఎలా చూపిస్తారు. సాయి పల్లవి ఈ సినిమా ఒప్పుకున్న కారణాలు ఏంటన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది.

Also Read : Pushpa Raj : అల్లు అర్జున్ కోసం మరో అరవ దర్శకుడు..!

  Last Updated: 21 Sep 2023, 10:44 AM IST