యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్‌లో సరికొత్త మైలురాయిని ‘తండేల్’ సినిమా నెలకొల్పింది. ఈ చిత్రంతో ఆయన తొలిసారి రూ. 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టారు. ఆ విజయంతో చైతూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై మరింత ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘NC 24’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మధ్యలో దర్శకుడి వివాహ కారణంగా కొద్ది రోజుల విరామం తీసుకున్న యూనిట్, ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచింది. షూటింగ్ దశలోనే సినిమా చుట్టూ హ్యూజ్ బజ్ ఏర్పడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
New Rules : నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్
ఇంకా టైటిల్ ప్రకటించకపోయినా, ఫస్ట్ లుక్ విడుదల చేయకపోయినా ‘NC 24’పై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఓవర్సీస్ రైట్స్‌కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ₹7 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే నాగ చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన హయ్యెస్ట్ ఓవర్సీస్ డీల్ అవుతుంది. ‘తండేల్’ బ్లాక్‌బస్టర్ విజయంతో చైతూ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందని చెప్పవచ్చు. థియేట్రికల్ కాకుండా నాన్-థియేట్రికల్ హక్కులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడటం సినిమాపై ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది.
Bengaluru : బెంగళూరులో దారుణం.. యువకుడిని వెంటాడి కారుతో ఢీ
‘NC 24’ ఒక మిథికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోంది. ఈ జానర్‌కు ప్రేక్షకులలో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. కథ, స్క్రీన్‌ప్లే, విజువల్ ఎఫెక్ట్స్ తో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన సెట్‌లతో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంగీతం అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి ‘వృష కర్మ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. నవంబర్ 23న నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.
