నందమూరి నటసింహాం బాలయ్య అంటే మాస్ ప్రేక్షకుల్లో ఓ క్రేజ్.. దాదాపు ఆయన నటించిన సినిమాలన్నీ మాస్ అంశాలతో రూపుదిద్దుకున్నవే. నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన మాస్ సినిమాలతో జానపద, పౌరాణిక సినిమాలు సైతం చేశాడు. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అప్పట్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది.
1994 ఏప్రిల్ 14న విడుదలైన భైరవద్వీపం తెలుగు ఫాంటసీ మూవీస్ లోనే ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. రోజా గ్లామర్, రంభ ఐటెమ్ సాంగ్, బాబూమోహన్ కామెడీ, కేఆర్ విజయ ప్రెజెన్స్ మాంత్రికుడు పాత్రలో నటించిన విజయరంగరాజు.. ఇలా అన్ని విషయాల్లోనూ స్పెషల్ అనిపించుకున్న ఈ చిత్రానికి నంది అవార్డులు రావడం విశేషం.
ముఖ్యంగా తన కెరీర్ మొత్తం ఎన్నో ప్రయోగాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వ మాయాజాలం మైమరపిస్తుంది. రీ రిలీజ్ ట్రెండ్ లో భైరవ ద్వీపం మళ్లీ విడుదల కాబోతోంది. 4కే టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ చేసుకుని ఆగస్ట్ 5న విడుదల కాబోతోందీ చిత్రం. చందమామ విజయ కంబైన్స్ బ్యానర్‌పై బి వెంకటరామి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.