NBK 109 Release date : ‘NBK 109′ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఫేమ్ బాబీ(Boby) కలయికలో తెరకెక్కుతున్న మూవీ #NBK109 (వర్కింగ్ టైటిల్). గత కొద్దీ రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వస్తుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి వీర మాస్ (Veera Mass) అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత ఏడాది సంక్రాంతికి.. అటు బాలకృష్ణ కు, ఇటు బాబీకి కలిసి వచ్చిన ‘వీర’ సెంటిమెంట్‌ను మళ్లీ కొనసాగిస్తూ, ఈ చిత్రానికి కూడా ‘వీర’ అనే అక్షరాలు కలిసొచ్చేలా టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్లు వినికిడి. మరి నిజంగా ఆ టైటిల్ పెడతారా..లేదా అనేది చూడాలి. బాలయ్య బర్త్ డే కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. SS థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also : Youtuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయి పై పోలీసులకు పిర్యాదు చేసిన యువతీ