Site icon HashtagU Telugu

NBK108 Release Date: విజయదశమికి బాలయ్య ఆయుధ పూజ.. దసరా బరిలో NBK108!

Nbk

Nbk

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న NBK108 విజయదశమి (దసరా)కి విడుదలవుతోంది. గాడ్ ఆఫ్ మాస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్, కుటుంబ అంశాలతో తెరకెక్కుతోంది. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ఉగాది సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈవాళ దసరాకి NBK108ని విడుదల చేస్తామని ప్రకటించారు. “విజయదశమికి ఆయుధ పూజ” అని ప్రకటించారు. బాలకృష్ణ పోస్టర్‌లో చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు. కాళీ దేవి ఫొటో కూడా పోస్టర్ లో చూడొచ్చు.

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం భారీ అంచనాలు రేపుతోంది. #NBK108కి S థమన్ స్వరాలు సమకూర్చగా, C రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని చూసుకుంటున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేయనున్నారు.