Site icon HashtagU Telugu

NBK107: బాలయ్య బర్త్ డేకు స్పెషల్ పోస్టర్!

Balaiah

Balaiah

గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ 107వ సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక పోస్టర్ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అనౌన్స్ చేసిన పోస్టర్ లో బాలకృష్ణ చేతులు వెనుకకు ముడుచుకున్న తీరుతో తెలియని వేదనలో ఉన్నాడని తెలుస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఓ ఇంటెన్స్‌ పాత్రను పోషిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు ఇతర ప్రముఖ తారాగణం, చంద్రిక రవి ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఎన్‌బికె 107కి ఎస్ థమన్ సంగీతం అందించారు.