Site icon HashtagU Telugu

NBK107 1st Look: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే!

Balakrishna

Balakrishna

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం మొదటి రోజు షూటింగ్ నుంచి లీక్ అయిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ సినిమాలో బాలకృష్ణ లుక్‌కి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను విడుదల చేయాల్సిందిగా మేకర్స్ భావించారు. ఈ మేరకు ఒక ఆసక్తికరమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు. బాలకృష్ణ ఒక విభిన్నమైన గెటప్‌లో పవర్‌ఫుల్ గా కనిపిస్తున్నాడు. మైనింగ్ ఏరియాలో స్టైలిష్‌గా నడుస్తున్నట్లు ఈ పోస్టర్ లో చూడొచ్చు.

షేడ్స్, నెరిసిన గడ్డం, వాచ్, రుద్రాక్ష మాలలతో అంచనాలు పెంచేశాడు. బాలకృష్ణ ముఖంలో ఇంటెన్సిటీ ఉంది. సింహంలా కనిపిస్తున్నాడు. నల్లని ఖాదీ చొక్కా, గోధుమరంగు పంచె లుంగీగా వేసుకున్న అతని డ్రెస్సింగ్ కూడా భిన్నంగా ఉంది. ది ల్యాండ్ రోవర్ పక్కన నడుస్తున్నప్పుడు.. బాలయ్యను ఎవరూ ఆపలేరన్నట్టుగా ఉంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణ ఎంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని పోషిస్తున్నాడు.

బోయపాటి శ్రీను సాధారణంగా బాలకృష్ణను బెస్ట్ గెటప్స్ లో చూపిస్తాడు. అయితే గోపీచంద్ మలినేని మునుపెన్నడూ చూడని బలమైన పాత్రలో నటుడిని ప్రెజెంట్ చేస్తున్నాడు. బాలకృష్ణ లుక్ మాస్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. #NBK107 షూటింగ్ ఇటీవలే సిరిసిల్లలో ప్రారంభమైంది, బాలకృష్ణ మొదటి రోజు నుంచే చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

Exit mobile version