Site icon HashtagU Telugu

NBK 109 : బాలకృష్ణ 109.. ఆ 3 టైటిల్స్ లో ఒకటి..!

NBK 109 Three Titles in Discussion

NBK 109 Three Titles in Discussion

NBK 109 నందమూరి బాలకృష్ణ 109వ సినిమాగా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా కూడా బాలయ్య మార్క్ మాస్ అంశాలతో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధం అవుతుంది. ఏపీ ఎలక్షన్స్ కోసం సినిమాలకు కొద్దిపాటి బ్రేక్ ఇచ్చిన బాలకృష్ణ మళ్లీ తిరిగి షూటింగ్ మొదలు పెట్టారు. ఎన్.బి.కె 109వ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెల హీరోయిన్స్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నాడు.

బాలకృష్ణ 109వ సినిమాకు ఇదివరకు వీర మాస్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఐతే ఇప్పుడు దాన్ని మార్చి అసురుడు అని పెట్టబోతున్నారని టాక్. అదే కాదు డెమోన్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న బాలకృష్ణ 109వ సినిమాతో కూడా అదే రేంజ్ మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

బాలకృష్ణ 110వ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రాబోతుంది. ఐతే ఈ సినిమా అఖండ సీక్వెల్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. అఖండ 2 సినిమా కోసం ఆడియన్స్ అంతా కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అఖండ 2 సినిమా ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.