Site icon HashtagU Telugu

NBK109 : టైటిల్ ఫిక్స్ అయినట్లేనా..?

Nbk109title

Nbk109title

NBK 109 Title : ‘NBK 109′ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఫేమ్ బాబీ(Boby) కలయికలో తెరకెక్కుతున్న మూవీ #NBK109 (వర్కింగ్ టైటిల్). గత కొద్దీ రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వస్తుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి ‘సర్కార్ సీతారామ్’ (Sarkar Seetharam) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీపావళి రోజున టైటిల్తో పాటు టీజర్ కూడా రివీల్ చేయనున్నట్లు టాక్. మరి నిజంగా ఆ టైటిల్ పెడతారా..లేదా అనేది చూడాలి. బాలయ్య బర్త్ డే కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. SS థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Read Also : CM Revanth Reddy : తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై సీఎం కీలక ప్రకటన