NBK 109 రిలీజ్ డేట్ ఎప్పుడు..? ఆ రెండు డేట్స్ లో ఒకటి ఫిక్సా..?

NBK 109 2024 దసరాకి భగవంత్ కేసరి తో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను బాబీ తన స్టైల్ లో క్రేజీ యాక్షన్ మూవీగా

Published By: HashtagU Telugu Desk
Nbk 109 Release Date Update Ks Bobby Movie

Nbk 109 Release Date Update Ks Bobby Movie

NBK 109 2024 దసరాకి భగవంత్ కేసరి తో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను బాబీ తన స్టైల్ లో క్రేజీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. శర్వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక న్యూస్ వైరల్ గా మారింది. బాలయ్య బాబీ కాంబో సినిమాను జూలై థర్డ్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

జూలై 19 లేదా 26 తేదీల్లో బాలకృష్ణ సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా దసరా బరిలో తీసుకొస్తారని వార్తలు వచ్చాయి. కానీ అనుకున్న దాని కన్నా ముందే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆగష్టు లో పుష్ప 2, సెప్టెంబర్ లో ఓజీ రిలీజ్ లు ఉన్నాయి. ఇక దసరాకి ఎన్.టి.ఆర్ దేవర ఆల్ర్డీ వస్తుంది. మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతాయని టాక్.

అందుకే బాలయ్య సినిమాను జూలై లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోన్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ శివరాత్రికి రిలీజ్ చేస్తారని టాక్. ఎన్.బి.కె 109 సినిమాలో యానిమల్ విలన్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే.

  Last Updated: 28 Feb 2024, 12:25 PM IST