Site icon HashtagU Telugu

Nayanthara In GodFather: నయనతార ఫస్ట్ లుక్ రివీల్!

Nayanatara

Nayanatara

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్‌ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నారు. చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటివల విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈరోజు ఈ సినిమాలో నయనతార పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో ఆమె సత్యప్రియ జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. నయనతార కాటన్ లినెన్ చెకర్డ్ చీరలో సాంప్రదాయకంగా కనిపిస్తోంది. టైప్‌రైటర్‌లో లెటర్ ని రెడీ చేస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నయనతార. త్వరలోనే చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నారు. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు, కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది.

Exit mobile version