Site icon HashtagU Telugu

Nayanthara: ఫోన్ పగిలిపోద్ది.. అభిమానికి నయన్ తార మాస్ వార్నింగ్!

Nayanatara

Nayanatara

స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సహజంగా ఫాలోయింగ్ ఉంటుంది. తమ అభిమాన హీరోనో, హీరోయిన్ కనిపిస్తే అభిమానులు వెంట పడటం, సెల్ఫీలు తీసుకోవడం కామన్ గా మారింది. అయితే ఒక్కొసారి అభిమానుల ప్రవర్తన నటీనటులకు విసుగు తెప్పిస్తుంది కూడా. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ్ బ్యూటీ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. పూజల అనంతరం భర్తతో కలిసి నయనతార బయటకొచ్చింది. అభిమానులు చుట్టిముట్టి ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఓ వ్యక్తి వీడియో తీయడాన్ని గమనించిన నయనతార వెంటనే అతనికి మాస్ వార్నింగ్ ఇచ్చింది. వీడియో తీస్త ఫోన్ పగులకొడుతానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం నయన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కుంభకోణం ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత, ఈ జంట పూర్వీకుల ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఈ జంట పూజ చేయడానికి రావడంతో, నయనతారను త్వరగా చూసేందుకు అభిమానులు గుమిగూడారు. ఓ వ్యక్తి వీడియో తీయడంతో నయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నయనతార తెలుపు, నీలం రంగు దుస్తుల్లో కనిపించగా, నీలిరంగు టీ షర్ట్, ఖాకీ ప్యాంట్, తెల్లటి జాకెట్‌లో కనిపించారు. ప్రస్తుతం నయన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.