గత వారం రోజులుగా నయనతార – విఘ్నేష్ శివన్ జంట విడాకుల వార్తలు (Nayanthara Vignesh Shivan Divorce) కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. నయనతార తన భర్తతో విభేదాల కారణంగా విడిపోయే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం వైరల్ అయింది. దీనికి కారణం నయనతార పేరిట ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడం. అందులో “భర్త మూర్ఖుడైతే పెళ్లి చేయడం తప్పు, భర్త చేసిన తప్పులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి” అన్నట్లుగా మెసేజ్ ఉండడంతో ఈ గాసిప్ మామూలుగా లేదు. అయితే ఇది నిజమైన పోస్ట్ కాదా లేక నయన్ వెంటనే డిలీట్ చేసిందా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో వదంతులు ఎక్కువయ్యాయి.
Bihar Elections : ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
ఇక ఈ వార్తల జోరులో నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరూ కలిసి మురుగన్ ఆలయంలో కనిపించడంతో వీరి మధ్య విభేదాలు లేవనే అభిప్రాయం వినిపించింది. తమ పిల్లలతో కలిసి దర్శనానికి వచ్చారు కాబట్టి వీరి మధ్య విబేధాలన్నీ కేవలం ఊహాగానాలే అన్న అభిప్రాయం బలపడింది. అయినా సరే విడాకుల గురించి మళ్లీ కొన్ని వార్తలు బయటకు రావడంతో, నయనతార తానే స్వయంగా స్టెప్ తీసుకొని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తాజాగా నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో విఘ్నేష్ శివన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ “మా గురించి ఇలాంటి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే” అంటూ పోస్ట్ చేసింది. దీంతో విడాకులపై జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. ఈ జంట మధ్య బంధం ఇంకా బలంగానే ఉందని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా చేస్తుండగా, నయనతార చిరంజీవి మెగా 157 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
