Site icon HashtagU Telugu

Lady Superstar : ‘నన్ను’ ఆలా పిలవొద్దు – నయనతార రిక్వెస్ట్

Nayan

Nayan

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులు, మీడియా, సినీ వర్గాలు తనను ‘లేడీ సూపర్ స్టార్’ (Lady Superstar) అని సంభోదించడం వల్ల తనకు గర్వంగా, సంతోషంగా అనిపించినప్పటికీ, తాను స్వయంగా మాత్రం అలా పిలవకూడదని కోరారు. తనను ‘నయనతార’ అనే పేరుతోనే పిలవాలని, అదే తనకు మరింత ఇష్టమని పేర్కొంది.

Credit Card Rules: ఏప్రిల్ 1 నుండి ఈ క్రెడిట్ కార్డ్‌ల నియమాలు మార‌నున్నాయా?

నయనతార తన పేరే తనకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చిందని, ఇది తనను నటిగానే కాకుండా వ్యక్తిగానూ తెలియజేస్తుందని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో తన ప్రయాణంలో అభిమానులు ఇచ్చిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోనని, కానీ బిరుదులతో తనను సంబోధించడానికి తనంతట తాను ఇష్టపడడం లేదని పేర్కొంది.

అభిమానులు తనను అత్యంత అభిమానంతో ప్రేమతో ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలుస్తున్నా, ఆ బిరుదులు కొన్నిసార్లు తన అసలైన పని నుంచి దూరం చేసే ఇమేజ్‌ను తెచ్చిపెడతాయని నయనతార అభిప్రాయపడింది. “బిరుదులు వెలకట్టలేనివి, అవి ఒక గౌరవంగా భావించినా, నాకు నా నిజమైన పేరు ‘నయనతార’కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది” అంటూ తన మనసులో మాటను వెల్లడించింది. నయనతార వ్యాఖ్యలు సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నప్పటికీ, ఇలాంటి సాధారణ అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానం ఆమెను మరింత దగ్గర చేస్తోంది.