Site icon HashtagU Telugu

Nayanathara : సరోగసీ లేదా దత్తత? నయనతారపై ట్రోల్స్..!!

Nayana

Nayana

సౌత్ సూపర్ స్టార్ నయనతార తల్లి అయ్యారు. ఈ జంట కవల కుమారులకు స్వాగతం పలికారు. ఈ శుభవార్తను విఘ్నేష్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ జంట అభిమానులు సంతోషించారు. సోషల్ మీడియా ద్వారా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ జంట సరోగసీ సాయం తీసుకున్నారా లేదా దత్తత తీసుకున్నారా అంటూ చర్చ మొదలైంది.

#సరోగసీ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఇందులో నయనతార గర్భం దాల్చకుండా పిల్లలు పుట్టడంపై పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భారత్ సరోగసిని వ్యాపారంగా ఉపయోగిస్తున్నారని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు దీనిని ట్రెండ్ గా మార్చుకున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. నయన్, విఘ్నేష్ మొదట సరోగసీ కోసం నిర్ణయించుకున్నారని…తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారంటున్నారు నెటిజన్లు.

నయన్ అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. సరోగసీ ద్వారా కన్నారా లేదా దత్తత తీసుకున్నారా అనేది వాళ్ల ఇష్టం అంటున్నారు. తమ పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. ఇతరుల అభిప్రాయం పై కాదంటూ ట్రోలర్స్ కు సమాధానం ఇస్తున్నారు. ఎవరి పనులు వారు చూసుకోవాలి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

https://twitter.com/kichukii/status/1579112532354400256?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579112532354400256%7Ctwgr%5E12e123a2fcee9532e5592220a731740ea552f550%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fnews%2Fstory%2Fnayanthara-becomes-mother-gets-criticized-for-choosing-surrogacy-fans-say-mind-you-business-tmovp-1552890-2022-10-10

https://twitter.com/_aimethevan/status/1579113415226052608?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579113415226052608%7Ctwgr%5E12e123a2fcee9532e5592220a731740ea552f550%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fnews%2Fstory%2Fnayanthara-becomes-mother-gets-criticized-for-choosing-surrogacy-fans-say-mind-you-business-tmovp-1552890-2022-10-10

 

 

https://twitter.com/WifeOf__Rolex/status/1579105099355664384?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579105099355664384%7Ctwgr%5E12e123a2fcee9532e5592220a731740ea552f550%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fnews%2Fstory%2Fnayanthara-becomes-mother-gets-criticized-for-choosing-surrogacy-fans-say-mind-you-business-tmovp-1552890-2022-10-10