Site icon HashtagU Telugu

Nayanthara and Vignesh: నయనతార, విజ్ఞేష్ శివన్ పెళ్లి ఆహ్వాన వేడుక వీడియో వైరల్

Nayanatara

Nayanatara

నయనతార, విజ్ఞేష్ శివన్ రేపు (జూన్ 9న) పెళ్లి చేసుకోబోతున్నారు. ఈనేపథ్యంలో వారి పెళ్లి పత్రికకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చక్కటి సంగీతం, వధూవరులు నడిచి వెళ్తున్న దృశ్యం.. పెళ్లి జరిగే వేదిక వివరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెన్నైకి సమీపంలోని మహాబలిపురం షేరటన్ పార్క్ వేదికగా ఈ వివాహ ఘట్టం జరుగనుంది. నయనతార, విజ్ఞేష్ శివన్ లు 2015లో “నానుమ్ రౌడీ ధాన్” సినిమా షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డారు. గత అరేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. చెన్నైలోని ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్లో వీరిద్దరూ కలిసి ఉంటున్నారు.