Site icon HashtagU Telugu

Nayanthara: చెన్నైలో నయనతార, విఘ్నేష్ శివన్ ఇంటికి ఓ ముఖ్య అతిథి..!

Nayanthara and Vignesh Shivan's house in Chennai is a special guest..!

Sharuk Nayan

నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ఇంటికి ఓ ముఖ్య అతిథి అనుకోకుండా వచ్చి ఆశ్చర్యపరిచారు. ఆయనే బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్. విఘ్నేశ్, నయనతార గతేడాది వివాహం చేసుకోవడం, ఆ వెంటనే సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం తెలిసిందే. దీంతో నయనతార పిల్లలను చూసేందుకు షారుఖ్ విచ్చేసినట్టు తెలిసింది.

నయనతార (Nayanthara) ఇంటికి షారుఖ్ వచ్చిన సమాచారం తెలియడంతో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం షారుఖ్ ఖాన్ నయనతారతో కలసి ఇంటి బయటకు వచ్చేశారు. అభిమానులకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. నయనతార చెక్కిలిపై షారుఖ్ ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. షారుఖ్, నయనతార ‘జవాన్’ అనే సినిమాలో కలసి నటిస్తుండడం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది జూన్ లో విడుదల కానుంది. షారుఖ్ నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తూ రూ.1,000 కోట్ల వసూళ్ల సమీపానికి చేరుకోవడం తెలిసిందే.

Also Read:  Money: బ్యాంకు లాకర్‌లో డబ్బుకు చెదలు. గొల్లుమన్న భాదితురాలు