Site icon HashtagU Telugu

Actress Nayanthara: జూన్ 9న తిరుమల లో నయనతార పెళ్లి.. చెన్నైలో గ్రాండ్ పార్టీ!!

Nayanatara

Nayanatara

ఎట్టకేలకు హీరోయిన్ నయనతార పెళ్లి ముహూర్తం ఖరారైంది. బాయ్ ఫ్రెండ్, ప్రముఖ సినిమా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ఆమె పెళ్ళి జూన్ 9న జరగనుంది. తిరుమల వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నయనతార, విగ్నేష్ ఒక్కటి కానున్నారు. వాస్తవానికి ఏదైనా ప్రఖ్యాత టూరిజం స్పాట్ లో పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ తొలుత భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు.

ఈనేపథ్యంలో పెళ్లి తర్వాత చెన్నై వేదికగా కుటుంబ సభ్యులు, ఫిల్మ్ ఇండస్ట్రీ స్నేహితులతో గ్రాండ్ పార్టీ నిర్వహించాలని నయనతార, విగ్నేష్ డిసైడ్ అయ్యారు. ఇందులో విజయ్ సేతుపతి, సమంత, కమల్ హాసన్, శ్రుతి హాసన్ సహా ఎంతోమంది సినీ ప్రముఖులు పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, నయనతార, విగ్నేష్ ల నిశ్చితార్థం ఈ ఏడాది మార్చిలో కేవలం కుటుంబ సభ్యుల నడుమ ప్రయివేటు గా జరిగింది.