Nayantara Decisions: రోమాన్స్ కు నో, ప్రమోషన్స్ కు సై!

సౌత్ స్టార్ నయనతార తన పెళ్లి తర్వాత సంచలన నిర్ణయం తీసుకోబుతున్నట్టు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Nayanatara

Nayanatara

సౌత్ స్టార్ నయనతార తన పెళ్లి తర్వాత సంచలన నిర్ణయం తీసుకోబుతున్నట్టు సమాచారం. ఆమె రెండు నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ నయన్ తన సినిమాల మీడియా ప్రమోషన్లకు దూరంగా ఉండేది. ఆ విషయంలో సినిమా ప్రారంభంలోనే నిర్మాతలకు కండీషన్ కూడా పెట్టేది. అందుకు అగ్రిమెంట్ కూడా చేసుకునేది కూడా. ప్రమోషన్లలో పెళ్లి ప్రస్తావన రాకుండా ఉండేందుకు నయన్ మీడియాకు దూరంగా ఉండేదట.

గతంలో శింబు, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది. ఆ సమయంలో నయనతార పెళ్లిపై రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె విఘ్నేష్‌ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు చెక్ పెట్టినట్టయింది. కాబట్టి సినిమా ప్రమోషన్స్‌లో నయన్ పాల్గొనవచ్చునని భావిస్తున్నారు. ఒకవేళ నయనతార ప్రమోషన్లకు ఓకే చెబితే నిర్మాతలకు కచ్చితంగా గుడ్ న్యూస్ లాంటిదే. ఇంకో షాకింగ్ నిర్ణయం ఏమిటంటే.. ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకుంది. ఇది నయనతార అభిమానులకు బ్యాడ్ న్యూస్ లాంటిదే.

  Last Updated: 14 Jun 2022, 12:56 PM IST