Site icon HashtagU Telugu

Nayanthara : జవాన్ కంటే ముందే.. షారుక్‌‌కి జోడిగా నయనతార కనిపించాలి.. కానీ..!

Nayanathara Miss the Chance working with Shahrukh Khan before Jawan

Nayanathara Miss the Chance working with Shahrukh Khan before Jawan

సౌత్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార(Nayanthara).. సినీ పరిశ్రమకు వచ్చిన దాదాపు 20 ఏళ్ళ తర్వాత బాలీవుడ్(Bollywood) ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా, నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన జవాన్ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్క్రీన్ పై షారుఖ్-నయన్ పెయిర్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందే.. ఈ జంట స్క్రీన్ పై మెరవాల్సింది. అది కూడా షారుఖ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన సినిమాలో, కానీ అప్పుడు కుదరలేదు. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమాలో ‘వన్‌ టూ త్రీ ఫోర్‌’ అనే ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో షారుఖ్ తో కలిసి హీరోయిన్ ప్రియమణి కలిసి డాన్స్ వేసి అదరగొట్టింది. అయితే ఈ సాంగ్ ఆఫర్ ముందుగా నయనతార దగ్గరకి వచ్చిందట. అయితే కారణం ఏంటో తెలియదు గాని నయన్.. అప్పుడు సున్నితంగా ఆ ఆఫర్ ని తిరస్కరించిందట. దీంతో ఆ సాంగ్ ప్రియమణి వద్దకి వెళ్ళింది. అప్పటిలో ఈ సాంగ్ బాగా ట్రెండ్ అయ్యింది.

అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా, ప్రియమణి స్పెషల్ సాంగ్ లో కనిపించారు. ఆ తరువాత షారుఖ్ తో నయనతార జోడిగా చేసిన జవాన్ సినిమాలో.. దీపికా, ప్రియమణి ముఖ్య పాత్రలు చేశారు. ఇక నయనతార ఒక పక్క సినిమాలు చేస్తూనే, మరో పక్క బిజినెస్ వుమెన్ గా కూడా సత్తా చాటుతుంది. మగువల అందాన్ని మరింత పెంచేందుకు ‘9 స్కిన్’ అనే కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ ని మార్కెట్ లోకి తీసుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా ముందుగా వెళ్తుంది. మరో పక్క భర్త విగ్నేష్ శివన్, పిల్లలతో ఫ్యామిలీ టైం కూడా ఎంజాయ్ చేస్తుంది.

 

Also Read : Hi Nanna : నాని, మృణాల్ ‘హాయ్ నాన్న’ టీజర్ చూశారా? నాన్న సెంటిమెంట్ తో పాటు లవ్ ఎమోషన్స్ కూడా..