సౌత్ స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ (Lady Superstar) నయనతార ఈమధ్య కాస్త దూకుడు తగ్గించినట్టు కనిపిస్తుంది. ఐతే బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకుంది అమ్మడు. జవాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ సినిమాలో తన మార్క్ యాక్టింగ్ తో మెప్పించింది. ఇక కోలీవుడ్ లో కూడా వరుస సినిమాల్తో దూసుకెళ్తున్న నయనతార ఇప్పుడు ఒక యంగ్ హీరో సినిమాలో నటిస్తుందట.
యువ హీరోతో అది కూడా లవ్ స్టోరీ లో అమ్మడు నటిస్తుందట. కోలీవుడ్ లో ఈమధ్యనే స్టార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కవిన్ రాజ్ (Kavin Raj) నెక్స్ట్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు విష్ణు ఎడవన్ డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తన కన్నా ఏజ్ ఎక్కువ ఉన్న అమ్మాయిని ప్రేమించే హీరో.. ఆ హీరోయిన్ గా నయనతార.. ఇలా ఏజ్ గ్యాప్ ఉన్న ఈ లవ్ స్టోరీ స్క్రిప్ట్ బాగా వచ్చిందట.
నయనతార (Nayanatara) ఏదైనా సినిమా సెలెక్ట్ చేసుకుంది అంటే అందులో కచ్చితంగా మ్యాటర్ ఉంటుంది. కెవిన్ రాజ్ సినిమాతో కూడా కెవిన్ రాజ్, నయన్ ఇద్దరు అదరగొట్టేస్తారని అంటున్నారు. స్టార్ హీరోయిన్ గా కేవలం స్టార్ హీరోలతోనే నటిస్తానని చెప్పకుండా అమ్మడు యువ హీరోలతో కూడా జత కడుతుంది. అందుకే నయనతార అక్కడ అందరి ఫేవరెట్ అవుతుంది.
లోకేష్ కనకరాజ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన విష్ణు ఎడవన్ ఈ లవ్ స్టోరీని క్రేజీగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. తమిళ పరిశ్రమ నుంచి ఒక మంచి లవ్ స్టోరీ వచ్చి చాలా రోజులు అవుతుంది. మరి ఈ లవ్ స్టోరీ కోలీవుడ్ ఆడియన్స్ తో పాటుగా అందరినీ అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Dussehra Release : దసరాని వాళ్లకే వదిలేశారా.. పోటీ పడే కంటే ఆరోజు రావొచ్చుగా..?
