Site icon HashtagU Telugu

Nayanatara at GQ Young Infulential Indian Awards : నయనతారకు బాలీవుడ్ నీళ్లు పడ్డాయోచ్.. ఆ ఈవెంట్ లో ఎప్పుడు చూడని విధంగా షాకింగ్ లుక్..!

Nayanatara At Gq Young Infulential India Awards 2024 Event

Nayanatara At Gq Young Infulential India Awards 2024 Event

Nayanatara at GQ Young Infulential India Awards సౌత్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ తో నయనతార బీ టౌన్ ఆడియన్స్ ను మెప్పించింది. జవాన్ హిట్ తో బాలీవుడ్ నుంచి అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి.

కోలీవుడ్ లో కాస్త దూకుడు తగ్గించిన నయనతార బాలీవుడ్ లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ ఈవెంట్స్ లో పాల్గొంటుంది.

సౌత్ లో ఏ ఈవెంట్స్ కు రాని నయనతార బాలీవుడ్ ఈవెంట్స్ లో మాత్రం పాటిస్పేట్ చేస్తుంది. అలా ఊరకనే వెళ్లడం కాదు గ్లామర్ షోతో రచ్చ రంబోలా చేస్తుంది. లేటెస్ట్ గా జ్క్యూ యంగ్ ఇన్ ఫ్యుయెన్షియల్ అవార్డ్స్ లో నయనతార లుక్ చూసి అందరు షాక్ అయ్యారు. మన లేడీ సూపర్ స్టార్ నేనా మనం చూస్తుంది అనిపించేలా అమ్మడి గ్లామర్ షో ఉంది.

Also Read : Mrunal Thakur : మాజీ బోయ్ ఫ్రెండ్ ను గుర్తు చేసుకుని హీరో చెంప చెల్లుమనిపించిన మృణాల్..!

ఇన్నాళ్లు తనకు తిరుగు లేదని అనుకున్న నయనతార గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ బాలీవుడ్ లో నెగ్గుకు రావాలంటే నటన ఒక్కటే కాదు గ్లామర్ ట్రీట్ కూడా కంపల్సరీ అందుకే నయనతార అలా ఫిక్స్ అయ్యింది. అమ్మడు బ్లాక్ డ్రెస్ లో థై షో చేస్తూ చేసిన గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదు. తన కెరీర్ మొత్తంలో నయనతార ఇలా గ్లామర్ షో చేసింది లేదని చెప్పొచ్చు.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే కోలీవుడ్ లో సెట్స్ మీద 3 సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయని తెలుస్తుంది.