Site icon HashtagU Telugu

Nayanatara : అమ్మోరుగా మరోసారి నయనతార..!

Nayanatara Again Doing Ammoru Role In Mukutthi Amman 2

Nayanatara Again Doing Ammoru Role In Mukutthi Amman 2

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈమధ్య కాస్త దూకుడు తగ్గించిందని అనిపిస్తున్నా అమ్మడు ఇప్పటికీ తన మార్క్ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నయనతార నటించిన మూకత్తి అమ్మన్ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో నయనతార (Nayanatara,) అమ్మోరుగా నటించిన విషయం తెలిసిందే. ఆర్ జే బాలాజీ నటించిన ఈ సినిమాను ఆర్ జే బాలాజి (RJ Balaji), సర్వనన్ కలిసి డైరెక్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐతే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

నయనతార లీడ్ రోల్ లో మూకుత్తి అమ్మన్ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఐతే ఈ సినిమాను స్టార్ డైరెక్ట్ సుందర్ సి (Sundar C) డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ సుందర్ సి ప్రత్యేకమైన సినిమాలను చేస్తుంటారు. ఆయన డైరెక్ట్ చేసిన అరణ్మయి సీరీస్ లకు సూపర్ క్రేజ్ ఏర్పడింది.

మూకుత్తి అమ్మన్ సీక్వెల్..

ఇక ఇప్ప్పుడు మూకుత్తి అమ్మన్ (Mukutthi Amman 2) సినిమా సీక్వెల్ కూడా ఆయన చేతిలో పెడుతున్నారు. అమ్మోరుగా మరోసారి నయనతార తన నట విశ్వరూపోం చూపించనున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో బయటకు రానున్నాయి. జవాన్ తో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన నయనతార అక్కడ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది.

ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా సరే నయనతార మాత్రం తన టలెంట్ తో ఫ్యాన్స్ ని సాటిస్ఫైడ్ చేస్తుంది.

Also Read : Khairatabad Ganesh Shobha Yatra : ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర