Site icon HashtagU Telugu

Nayanatara : నయనతారకు ఇప్పుడు టాలీవుడ్ గుర్తుకొచ్చిందా..?

Nayanatara Love with Young Hero, Is It Worked Out Well

Nayanatara Love with Young Hero, Is It Worked Out Well

Nayanatara కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కెరీర్ కాస్త పట్టు తప్పిందని చెప్పొచ్చు. ఇన్నాళ్లు కోలీవుడ్ లో హీరోయిన్ అంటే తన తర్వాతే ఎవరైనా అన్న రేంజ్ లో రెచ్చిపోయింది అమ్మడు. ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సోలో సినిమాలతో సత్తా చాటింది. నయనతార సినిమా రిలీజ్ అంటే కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా వణికే రేంజ్ కి వెళ్లింది.

ఐతే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నయనతారకు అంతే.. విఘ్నేష్ శివన్ తో పెళ్లి ఆ తర్వాత సరోగసి తో పిల్లలను పొందిన అమ్మడు వారి ఆలన పాలనా చూసుకుంటూ వస్తుంది. ఐతే అంతకుముందు ఒక రేంజ్ ఫాం లో ఉన్నప్పుడు తెలుగు నుంచి ఎలాంటి ఆఫర్ వచ్చినా కనీసం వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించేది కాదు నయనతార.

మరీ పెద్ద బ్యానర్ స్టార్ సినిమా ఐతే తప్ప అమ్మడు అసలు యాక్సెప్ట్ చేయదు. ఐతే ఈమధ్య తెలుగులో కూడా ఆఫర్లు తగ్గడం అమ్మడిని ఆలోచనలో పడేసింది. అంతేకాదు పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలు చేస్తున్న హంగామా చూసి ఇప్పుడు తెలుగు నుంచి ఏదైనా అవకాశం వస్తే చేయాలని చూస్తుంది. మొత్తానికి తను బిజీ అని చెప్పిన పరిశ్రమ నుంచి ఆఫర్ల కోసం ఎదురుచూసేలా టాలీవుడ్ పరిస్థితి మారింది.