యువ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) తన మల్టీ టాలెంటెడ్ యాక్టివిటీస్ తో అందరినీ మెప్పిస్తూ ఉంటాడు. రీసెంట్ గానే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో ఈమధ్య కాలంలోనే నా అన్వేషణ యూట్యూబర్ ని ఇమిటేట్ చేస్తూ ఒక వీడియో పెట్టాడు. అది బాగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడాన్ని మర్చిపోలేకపోతున్నా అంటూ ఒక స్పెషల్ వీడియో షేర్ చేశాడు.
We’re now on WhatsApp : Click to Join
తన ఫ్రెండ్ వంశీకి డిప్రెషన్ కి ఏమైనా టాబ్లెట్ ఉందా అని అడుగుతాడు అతను డోలో 650 అని చెబితే నువ్వు ఎం.బి.బి.ఎస్ చేశావా పేమెంట్ సీటా అని అడుగుతాడు. నా కోసం కాదు నా ఫ్రెండ్ కోసం అని అంటాడు. మొత్తానికి ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోవడం దేశ ప్రజలందరినీ బాధ పెట్టింది.
Also Read : Bigg Boss 7 : డబుల్ ఎలిమినేషన్.. అందుకే ఆటగాళ్ల ప్లాన్ మారింది..!
అయితే టీం ఇండియా అంతకుముందు జరిగిన 10 మ్యాచ్ లు గెలవగా ఫైనల్ మ్యాచ్ ఒక్కటి పరాజయ పాలయ్యారు. ఇది జీర్ణించుకోలేని చాలామంది డిప్రెషన్ లో ఉన్నారు. దాన్ని నవీన్ పొలిశెట్టి సరదాగా తన ట్విట్టర్ లో వీడియో పెట్టాడు.
Inkenni rojulo 💔 Asking for a friend . Dolo 650 daily #CWC2023Final pic.twitter.com/ssd0Je5DO5
— Naveen Polishetty (@NaveenPolishety) November 21, 2023