Miss Shetty Mr Polishetty Trailer : ప్రగ్నెంట్ అవ్వడానికి పెళ్లి అవసర్లేదు.. అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్ అయింది.

Published By: HashtagU Telugu Desk
Naveen Polishetty Anushka Miss Shetty Mrs Polishetty Trailer Released

Naveen Polishetty Anushka Miss Shetty Mrs Polishetty Trailer Released

యువ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), హీరోయిన్ అనుష్క(Anushka) కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) అనే సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్ అయింది.

ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇండిపెండెంట్ గా బతకాలనుకునే హీరోయిన్ లైఫ్ లోకి స్టాండప్ కామెడీ చేసుకునే హీరో వస్తాడు. అతన్ని ప్రగ్నెంట్ కావడానికి హెల్ప్ అడుగుతుంది. అనుష్క, నవీన్ మధ్య లవ్ కామెడీ సన్నివేశాలు, నవీన్ కామెడీ, చివర్లో ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

  Last Updated: 21 Aug 2023, 07:14 PM IST