జై, చందమామ(Chandamama), గౌతమ్ SSC సినిమాలతో హీరోగా మెప్పించిన నవదీప్(Navdeep) ఆ తర్వాత సెకండ్ హీరోగా సినిమాలు చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వెబ్ సిరీస్(Web Series) లలో హీరోగా బిజీ అయ్యాడు. గత కొంత కాలంగా నవదీప్ సినిమాల్లో కనపడకపోయినా వరుస సిరీస్ లలో మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం నవదీప్ న్యూసెన్స్ అనే సిరీస్ తో రాబోతున్నాడు.
నవదీప్, బిందు మాధవి జంటగా తెరకెక్కిన న్యూసెన్స్ సిరీస్ ఆహా ఓటీటీలో మే 12 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇప్పటికే టీజర్, సాంగ్, ట్రైలర్స్ తో ఈ సిరీస్ పై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగా నవదీప్ మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
నవదీప్ మాట్లాడుతూ.. నాకు మీడియాకు మంచి సంబంధం ఉంది. నన్నెప్పుడూ మీడియా వాళ్ళు వార్తల్లోనే ఉంచుతారు. నా కెరీర్ మొదట్లో నా వల్ల ఒక హీరోయిన్ చనిపోయిందని వార్తలు రాశారు అవన్నీ అబద్దం. ఇక నన్ను గే అని కూడా ఓ పత్రికలో రాశారు. అది కూడా అబద్దం. మరోసారి నేను రేవ్ పార్టీలో ఉన్నాను అని రాశారు. అది పూర్తిగా అబద్దం. ఆ సమయంలో నేను మా అమ్మతో ఫామ్ హౌస్ లో ఉన్నాను. కానీ ఆ వార్త వల్ల నాకు మంచే జరిగింది. అప్పటివరకు నాపై తప్పుడు వార్తలు రాయడంతో మా ఇంట్లో కూడా నమ్మట్లేదు. కానీ ఈ వార్త రాసినప్పుడు మా అమ్మతో ఉన్నాను కాబట్టి అవన్నీ తప్పుడు వార్తలు అని తెలుసుకొని ఇంట్లో నన్ను నమ్మారు అని తెలిపాడు. దీంతో నవదీప్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.
Also Read : KTR : తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ.. ఇళయరాజా ముందు KTR ప్రకటన..