మాదాపూర్ డ్రగ్స్ కేసు (Madhapur Drugs Case)లో భాగంగా ఈరోజు హీరో నవదీప్ (Navdeep) ను నార్కోటిక్ పోలీసులు (NCB Police) విచారించారు. దాదాపు ఐదు గంటల పాటు ఆయన్ను విచారించడం జరిగింది. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడుతూ.. విచారణకు పోలీసులు మరోసారి రమ్మన్నారని తెలిపాడు.
డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో నార్కోటిక్ బృందాలు బాగా పనిచేస్తున్నాయన్నాడు. వైజాగ్‌కు చెందిన రామచంద్‌తో తనకు పరిచయం ఉందని అంతే కానీ తాను ఎప్పుడు.. ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదన్నాడు. రామచంద్‌తో తాను ఎలాంటి డ్రగ్స్ కోనుగోలు చేయలేదని స్పష్టం చేశాడు. గతంలో ఒక పబ్‌ను నిర్వహించినందుకు తనను పోలీసులు పిలిచి విచారించారన్నాడు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. నవదీప్‌ను 37వ నిందితుడిగా చేర్చారు. మత్తు పదార్థాలు విక్రయించే వైజాగ్ కు చెందిన రామ్‌చందర్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే రామ్‌చందర్‌తో నవదీప్‌కు పరిచయం ఉన్నట్లు గుర్తించి నవదీప్‌ను విచారణకు పిలిచారు. రామ్‌చందర్, నవదీప్ మధ్య వాట్సాప్ సంభాషణలు, తదితర విషయాలపై పూర్తి ఆధారాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే నవదీప్‌ను విచారణకు రావాలని.. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు.
Read Also : 1st Day Chandrababu CID Interrogation : ఫస్ట్ డే చంద్రబాబు ను 60 ప్రశ్నలు వేసిన CID ..