Site icon HashtagU Telugu

Nava Thalapathy : టాలీవుడ్ నవ దళపతి వచ్చేశాడు..!

Nava Thalapathy Sudheer Babu movie release Plan on Dussehra Season

Nava Thalapathy Sudheer Babu movie release Plan on Dussehra Season

Nava Thalapathy కాస్త ఇమేజ్ వచ్చిన ప్రతి హీరో పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉండటం కామన్. స్టార్ హీరోలను తమ అభిమానులు ఆ ట్యాగ్ తోనే ఎక్కువగా రిజిస్టర్ అవుతుంటారు. స్కీన్ నేం పై తెలుగు హీరోలకు వారి అభిమానులకు ఉన్న క్రేజ్ మరో ఇండస్ట్రీలో ఉండదు. ఐతే ప్రతి హీరోకి ఈ ట్యాగ్ ఉండాలన్న రీజన్ లేదు కానీ మాక్సిమం క్రేజ్ తెచ్చుకున్న ప్రతి హీరోకి ఇది పెట్టేస్తుంటారు.

ఇక ఇప్పుడ్ మరో కొత్త ట్యాగ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఘట్టమనేని హీరో సుధీర్ బాబుకి అంతకుముందు నైట్రో స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. కానీ అది అంతగా రిజిస్టర్ అవ్వలేదు. ఐతే కొత్తగా ఆయన నటించిన హరోం హర సినిమాకు సుధీర్ బాబు పేరు ముందు నవ దళపతి అనే ట్యాగ్ పెట్టారు.

జ్ఞానసాగర్ ద్వారక డైరెక్షన్ లో తెరకెక్కిన హరోం హర సినిమా నేడు ప్రేఖకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ కార్డ్ లో సుధీర్ కి నవ దళపతి ట్యాగ్ ఉంచారు. ఇక మీదట సుధీర్ బాబుని అదే ట్యాగ్ తో పిలిచే ఛాన్స్ ఉంటుంది. హరోం హర కోసం సుధీర్ బాబు తన ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. మరి ఈ సినిమాతో అయినా సుధీర్ బాబు హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Also Read : Bigg Boss Season 8 : బిగ్ బాస్ ని వదలని శివాజి.. సీజన్ 8లో కూడా..?