Nani Hi Nanna : హాయ్ నాన్న అక్కడ కూడా సూపర్ హిట్టే.. నానికి అలా కలిసొస్తుంది..!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా హాయ్ నాన్న (Nani Hi Nanna). మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా

Published By: HashtagU Telugu Desk
Nani Mrunal Thakur Hi Nanna Movie Teaser Released

Nani Mrunal Thakur Hi Nanna Movie Teaser Released

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా హాయ్ నాన్న (Nani Hi Nanna). మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. ఒక బ్యూటిఫుల్ కథను అంతే బ్యూటిఫుల్ గా తెరకెక్కించి ఆడియన్స్ ని ఎమోషనల్ టచ్ చేశాడు డైరెక్టర్ శౌర్యువ్. కథ మరీ అంత కొత్తది కాకపోయినా తన కథనం ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాకు హేషం మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలిచింది. సినిమాకు అన్ని అలా పర్ఫెక్ట్ గా కుదిరాయి.

We’re now on WhatsApp : Click to Join

లాస్ట్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 7న రిలీజైన నాని (Nani) హాయ్ నాన్న మంచి సక్సెస్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ దసరా తో సూపర్ హిట్ అందుకున్న నాని అదే వరుసలో హాయ్ నాన్నతో కూడా తన ఖాతాలో హిట్ వేసుకున్నాడు. ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీ రిలీజైంది. నెట్ ఫ్లిక్స్ లో హాయ్ నాన్న జనవరి 4న రిలీజైంది. ఓటీటీలో కూడా హాయ్ నాన్న మంచి వాచ్ అవర్స్ సాధిస్తూ నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్స్ లో ఉంటుంది.

థియేట్రికల్ హిట్ మాత్రమే కాదు ఓటీటీ లో కూడా నాని హాయ్ నాన్న సూపర్ హిట్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో హాయ్ నాన్న సినిమా ప్లేస్ దక్కించుకుంది. సినిమా తెలుగుతో పాటుగా అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో అందుబాటులో ఉంది. అయితే తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ భాషల్లో హాయ్ నాన్నకి మంచి ఆదరణ లభిస్తుంది.

హాయ్ నాన్న (Hi Nanna) సినిమా పై నాని ముందు నుంచి సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. కరెక్ట్ టైం కి కరెక్ట్ సినిమా అనిపించేలా ఆడియన్స్ కి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా ఎక్స్ పీరియన్స్ అందిచాడు నాని. ఈ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు.

Also Read : Janvi Kapoor : సినిమా వాళ్లు డేటింగ్ కి పనికిరారా.. జాన్వీ కామెంట్స్ పై నెటిజెన్ల రియాక్షన్ ఇదే..!

ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక నాని విషయానికి వస్తే సరిపోదా శనివారం తర్వాత హిట్ 3 చేయాల్సి ఉంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాతో పాటుగా ఓజీ సినిమాలో కూడా ప్రియాంక నటిస్తుంది. పవన్ సినిమాతో అమ్మడి రేంజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.

  Last Updated: 09 Jan 2024, 09:54 AM IST