న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. శ్యాం సింగ రాయ్ హిట్ తర్వాత అంటే సుందరానికీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు ఇక తర్వాత వచ్చిన దసరా, హాయ్ నాన్న రెండు మంచి హిట్ గా నిలిచాయి. దసరా అయితే నానిని 100 కోట్ల క్లబ్ లో నిలబెట్టి అదరగొట్టింది. కొత్త దర్శకులతో నాని చేస్తున్న సినిమాలు సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్ సాధిస్తున్నాయి.
ఈ క్రమంలో నిర్మాతలు నానితో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా నాని తో సినిమా కోసం నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఒక నిర్మాత మాత్రం నాని తో సినిమా అంటే రిస్క్ అని భావిస్తున్నాడట. నాని తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి కాంబోలో ఒక సినిమా ప్లాన్ చేశారు. సినిమాకు నాని రేంజ్ కన్నా ఎక్కువ బడ్జెట్ అవుతుందని అనుకున్నారు. అయితే దసరాతో 100 కోట్లు కొట్టాడు కాబట్టి బడ్జెట్ పెట్టినా ఓకే అనుకున్నారు. కానీ సడెన్ గా నిర్మాత మధ్యలో డ్రాప్ అయ్యాడని టాక్.
సినిమాకు బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్లే ఆ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. నాని సినిమాకు అసలు బడ్జెట్ సమస్యలనేవి ఉండవు. అలాంటిది బడ్జెట్ ప్రాబ్లం వల్ల నాని సినిమా ఆగిపోవడం అందరిని ఆశ్చర్యపడేలా చేస్తుంది. నాని మీద అంత డౌట్ పడుతున్నారన్నది అర్ధం కావట్లేదు.
ఎలాగు తమిళ దర్శకుడు కాబట్టి సినిమా తెలుగుతో పాటుగా తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది. సో ఎలా చూసినా బిజినెస్ బాగానే వర్క్ అవుట్ అవుతుంది. మరి ఆ సినిమా పూర్తిగా ఆపేశారా లేదా బడ్జెట్ విషయంలో లెక్క చూసుకుని దిగుతారా అన్నద్ చూడాలి.