Nani Success Speech న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సినిమా సరిపోదా శనివారం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. జేక్స్ బి జోయ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు అతను అందించిన బిజిఎం సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. గురువారం రిలీజైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తుంది. ఐతే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా తెలుగు ప్రేక్షకుల గురించి వారి సినిమా ప్రేమ గురించి చెప్పారు.
సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన నాని తెలుగు ప్రేక్షకులను కొట్టే ప్రేక్షకులు మరెక్కడా ఉండరని మంచి సినిమాకు మీరు తోడుంటారని మరోసారి సరిపోదా శనివారం (Saripoda Shanivaram) తో ప్రూవ్ చేశారని అన్నారు. మిమ్మల్ని కొట్టే వాళ్లు లేరని సినిమాకు ఇంత మంచి సక్సెస్ చేసినందుకు థాంక్స్ అని అన్నారు. సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడి పనిచేశారని నాని చెప్పుకొచ్చారు.
వివేక్ తో తను చేసిన అంటే సుందరానికీ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఆ సినిమాతో ఉన్న లెక్క ఈ సినిమాతో బ్యాలెన్స్ అయ్యిందని అన్నారు నాని. ”’వర్షాల వల్ల ఎక్కడైనా సినిమా చూడటం ఇబ్బంది ఉంటే ఈ సినిమా చాలా కాలం ఉంటుంది. ఈ వీకెండ్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా సినిమా చూడాలని ప్రేక్షకులను కోరారు నాని.
లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్నతో సక్సెస్ అందుకున్న నాని సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. నెక్స్ట్ నాని హిట్ 3 తో వస్తున్నాడు.