Natural Star Nani న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న కెరీర్ బెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో నాని హాయ్ నాన్న చేశారు. ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో మరో హీరోయిన్ గా శృతి హాసన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం నాని 22 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. నిన్న మొన్నటివరకు నాని 10, 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకోగా దసరాతో 100 కోట్లు కొట్టే సరికి రెమ్యునరేషన్ కూడా డబుల్ అయ్యింది.
హాయ్ నాన్న సినిమాకు నాని (Nani) 22 కోట్లు తీసుకోగా నెక్స్ట్ చేస్తున్న తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి సినిమాకు 25 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఈ సినిమా వస్తుంది.
నాని హాయ్ నాన్న (Hi Nanna)కే కెరీర్ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అనుకుంటే ఇప్పుడు సిబి చక్రవర్తి సినిమాకు పాతిక కోట్లతో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన నాని ఒక్కో మెట్టు ఎక్కుతూ న్యాచురల్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. తనలా టాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని కొత్త దర్శకులతో ప్రయోగాలు చేస్తుంటాడు నాని. నాని చేస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ ఇయర్ దసరా (Dasara)తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాని హాయ్ నాన్నతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
Also Read : Kumari Srimathi: ఓటీటీలో దూసుకుపోతున్న కుమారి శ్రీమతి, ప్రైమ్ లో ట్రెండింగ్