Natu Natu: ఆస్కార్ బరిలో ‘నాటునాటు’ సాంగ్… సరికొత్త రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న ఈ పాట

  • Written By:
  • Publish Date - January 24, 2023 / 10:49 PM IST

Natu Natu: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న ఈ పాట.. తాజాగా ఆస్కార్ అవార్డుల్లో అధికారిక ఎంట్రీని దక్కించుకుంది. ఈ మేరకు తాము చరిత్రపు క్రియేట్ చేశామంటూ ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ అధికారికంగా ఓ ట్వీట్ ని పోస్ట్ చేసింది.

22 ఏళ్ల తర్వాత తొలి సారి ఆస్కార్ బరిలో నిలిచినట్లు ఆర్ఆర్ఆర్ యూనిట్ వెల్లడించింది. 95వ ఆస్కార్ నామినేషన్స్ ను ఆస్కార్ కమిటీ ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచే పలు సినిమాల జాబితాను తాజాగా విడుదల చేయగా.. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బరిలో నిలిచింది. కాగా ఆస్కార్ అవార్డులను మార్చి 13న ఆస్కార్ విజేతలకు అందించనున్నారు.

ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా:
నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్)
హోల్ట్ మై హ్యాండ్ ( టాప్ గన్: మార్వెరిక్)
లిఫ్ట్ మి అప్ (బ్లాక్ పాంథర్)
ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

సినిమా రంగంలో అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు ఆస్కార్ అవార్డులు. ఈ అవార్డు అందుకోవడం అంటే అంతర్జాతీయంగా గుర్తింపు సాధించినట్లే. ఆస్కార్ అవార్డును భారతీయ సినిమాకు 22 ఏళ్ల క్రితం దక్కగా.. మరోసారి ఇండియన్ సినిమా ఆస్కార్ బరిలో పోటీపడుతోంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోవడం తెలిసిందే.