అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసు (Jani Master Case) కు సంబదించిన ఇండస్ట్రీ లో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. తన భర్తను కావాలనే ఈ కేసులో ఇరికించారని .. ‘ఆ అమ్మాయిది హనీ ట్రాప్. ఆమెకు లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. అందుకే ఇలా చేసింది. ఆమెను పాములా వాడుకుంటున్నారు. ఈ రోజు ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్టు చేసి.. ఇవన్నీ చేయిస్తున్నారో..వాళ్ల కుటుంబం కూడా ఈ పొజిషన్ లో కూర్చుంటారు..అంటూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది జానీ వైఫ్ (Jani Wife). ఇటు ఇండస్ట్రీ లో కూడా కొంతమంది జానీకి సపోర్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత నట్టికుమార్ (Producer Natti kumar) కీలక వ్యాఖ్యలు చేసారు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈయన..సుకుమార్ (Director Sukumar ) వల్లే జానీ విషయం బయటకీ వచ్చిందని అన్నారు. బాధిత మహిళా కొరియోగ్రాఫర్ డైరెక్టర్ సుకుమార్ చెప్పడం వల్లే ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను సంప్రదించిందని తెలిపారు. పుష్ప 2 షూటింగ్ సమయంలో ఆ అమ్మాయి తన సమస్యను సుకుమార్ తో చెప్పిందని. దాంతో సుకుమార్ ఆ అమ్మాయిని ఒకసారి ఫిల్మ్ ఛాంబర్ లో తన కంప్లైంట్ రైజ్ చేయమని చెప్పినట్లు నట్టి కుమార్ వివరించారు. అలాగే దీని వెనుక ఫిలిం ఛాంబర్ పెద్దల హస్తం కూడా ఉందని నట్టికుమార్ ఆరోపించారు. జానీ మాస్టర్ పై కోపంతోనే ఫిలిం ఛాంబర్ ఇలా చేసిందన్నారు. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదు.? పోలీసు కేసు అవ్వగానే ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి..? పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ప్రెస్ మీట్ పెట్టి రిపోర్ట్ ఎందుకు బయట పెట్టారని వాదించారు. విచారణకు ముందే అతన్ని దోషిగా చేసి అతని అతన్ని ప్రెసిడెంట్ పదవి నుంచి సస్పెండ్ చేయడం వన్ సైడ్ మాత్రమే అవుతుంది. చేస్తే ఇద్దరి కార్డులు సస్పెండ్ చేయాలి.. కానీ, ఒకరిది మాత్రమే చేయడం ఏంటి? అసలు పబ్లిక్ చేయకుండా సబ్మిట్ చేయాల్సిన రిపోర్టును.. అందరి ముందు బయటపెట్టి.. భరద్వాజ అనే వ్యక్తి కక్షతో కేసును వన్ సైడ్ చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలపై అంత మాట్లాడుకుంటున్నారు.
ఇదిలా ఉంటె జానీ మాస్టర్ ఇష్యూలో అల్లు అర్జున్, సుకుమార్ ఇన్వాల్వ్ అయ్యారన్న ప్రచారంపై పుష్ప మూవీ నిర్మాత రవిశంకర్ స్పందించారు. ‘ఇది జానీ మాస్టర్, అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. ఆమె పుష్ప-2 సినిమాలో అడిషనల్ కొరియోగ్రాఫర్. ఆమెతో వర్క్ చేయించుకున్నాం. జానీ మాస్టర్ తో ఓ ఐటెమ్ సాంగ్ చేయించుకోవాల్సి ఉంది. ఈలోపే ఇలా జరిగింది. ఈ విషయంలో అల్లు అర్జున్ కు సంబంధం లేదు’ అని వెల్లడించారు.
Read Also : Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్