Site icon HashtagU Telugu

Natti Kumar : ఆయన చనిపోయాక ఇండస్ట్రీని ఎవరూ పట్టించుకోవట్లేదు.. నంది అవార్డ్స్ పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..

Natti Kumar sensational comments on Nandi Awards

Natti Kumar sensational comments on Nandi Awards

గత కొన్ని రోజులుగా నంది అవార్డ్స్(Nandi Awards) గురించి టాలీవుడ్(Tollywood) లో వివాదం నడుస్తుంది. ప్రభుత్వాలు నంది అవార్డ్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. కొన్ని రోజుల క్రితం నిర్మాత ఆదిశేషగిరి రావు, తమ్మారెడ్డి భరద్వాజ, అశ్విని దత్ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. నంది అవార్డ్స్ రెండు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. వాటి విలువ కూడా పోయింది. అసలు అవార్డులు ఇచ్చే ఆలోచనలో లేరు అని అన్నారు. ఇక అశ్విని దత్ వైసీపీ(YCP) ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ నంది అవార్డులు ఎందుకిస్తారు? ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులు ఇస్తారేమో, రెండేళ్లు ఆగితే మనకు అవార్డులు వస్తాయి అని టీడీపీని(TDP) ఉద్దేశించి అన్నారు.

అయితే వీరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో పోసాని కృష్ణమురళి సమాధానమిస్తూ.. అశ్వినీదత్ పై ఫైర్ అయ్యారు. తాజాగా నేడు ఇదే నంది అవార్డ్స్ గురించి నిర్మాత నట్టి కుమార్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నట్టి కుమార్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. నంది అవార్డ్స్ గురించి ఎందుకు గొడవ పడుతున్నారో తెలియటం లేదు. రౌడీలకు అవార్డ్స్ ఇవ్వండి అనటం తప్పు. రెండు రాష్టాలు 2014 నుండి సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదు. అవార్డ్స్ కు రివార్డ్స్ తీసుకున్నారు కొంతమంది పెద్దలు. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్స్ చేయమని చంద్రబాబు ఎందుకు అడగలేదు? మీరు అమరావతిలో భూములు తీసుకున్నారు కదా? అక్కడ షూటింగ్స్ చేయలేదు ఎందుకు? ఇప్పుడు ఇలా మాట్లాడటం సరి కాదు. కరోనాతో 5కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళను చూసుకోవద్దా? 2014 నుండి 2019 వరకు మీరు ఏం చేసారు? తెలంగాణలో కూడా అవార్డ్స్ గురించి మీరు అడగలేరు. టీడీపీకి సపోర్ట్ గా అశ్వినీదత్ మాట్లాడాడు అని అన్నాడు.

అలాగే దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ.. ఆయన ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దగా చాలా చేశారు. ఇండస్ట్రీ కోసం ప్రభుత్వాలతో మాట్లాడారు. ఆయన చనిపోయాక ఇండస్ట్రీని ఎవరూ పట్టించుకోవట్లేదు. రెండు ప్రభుత్వాలు దాసరి కోసం ఏమైనా చేస్తే బాగుంటుంది. దాసరి విజ్ఞాన పార్క్ పెట్టాలని ఎప్పట్నుంచో కోరుతున్నాను. ఆయనను గౌరవించుకోవాల్సిన భాద్యత మనది అని అన్నారు. దీంతో నేడు నంది అవార్డ్స్ పై నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

Also Read :   Vikram : విక్రమ్ కు పెద్ద ప్రమాదం.. విరిగిన పక్కటెముక.. హాస్పిటల్లో విక్రమ్..