Kantara Rishab Shetty ప్రతి ఒక్క హీరోకి నటుడిగా సక్సెస్ లు ఫెయిల్యూర్ లు.. హిట్లు ఫ్లాపులు అన్నది ఎంత ముఖ్యమో అవార్డుల విషయంలో జాతీయ అవార్డ్ కూడా అంతే ముఖ్యమని భావిస్తారు. నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటాలని ప్రతి నటుడు కల కంటాడు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ ఎంపిక అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే 70వ జాతీయ అవార్డుల్లో భాగంగా పురస్కారాలను ప్రకటించారు. ఇందులో భాగంగా జాతీయ ఉత్తమ నటుడిగా కాంతార హీరో రిషబ్ శెట్టి అవార్డ్ కైవసం చేసుకున్నారు.
కాంతార సినిమాలో అతని నటన చూసి అందరు అవాక్కయ్యారని తెలిసిందే. సినిమాకు అతనే దర్శకుడు కాగా అటు సినిమాను ఆఫ్ స్క్రీన్ చూసుకుంటూ ఆన్ స్క్రీన్ మీద అతని నటన ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. కాంతార సినిమాలో రిషబ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా కలిమాక్స్ లో అతని నటన రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.
కాంతార సినిమా ముందు కన్నడ వరకే రిలీజ్ కాగా ఆ సినిమా చూసిన తర్వాత ఇది అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా కాంతార సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగులో అయితే కాంతారాకి సూపర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఐతే ఆ సినిమా చూసిన టైం లోనే రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డ్ వస్తుందని అనుకోగా ఇప్పుడు అదే నిజమైంది. ఇదే కాదు ఉత్తమ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో కూడా కాంతార సినిమా అవార్డ్ అందుకుంది.
నేషనల్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి ఉత్తమ నటిగా నిత్యా మీనన్ (Nitya Menon) (తిరుచిత్రంబలం), మనసి ఫరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్) ఇద్దరికీ ఇచ్చారు. ఇక ఉత్తమ దర్శకుడిగా ఉంచాయ్ డైరెక్టర్ సూరజ్ అవార్డ్ అందుకున్నారు.