Site icon HashtagU Telugu

తమిళ ఇండస్ట్రీ ఫై పవన్ చేసిన వ్యాఖ్యలకు నాజర్ క్లారిటీ

Nasser Reacts On Pawan Kalyan Comments Over Tamil Industry

Nasser Reacts On Pawan Kalyan Comments Over Tamil Industry

బ్రో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక (Bro Pre release event)లో పవన్ కళ్యాణ్ తమిళ్ ఇండస్ట్రీ (Tamil industry) ఫై పలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌ సినిమాల్లో కేవలం తమిళ నటీనటులనే తీసుకోవాలని ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా కొత్త నియమాలు తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఆలా చేయడం మంచి పద్దతి కాదు..ఇండస్ట్రీ లో అన్ని భాషల వారు ఉండాలి అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఓ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాను తమిళ పరిశ్రమ చేయగలదని , మన ఇండస్ట్రీ లో మనవాళ్లే ఉండాలనే పద్ధతి మంచిది కాదని..ఈ విషయంలో మరోసారి తమిళ పరిశ్రమ ఆలోచించాలని పవన్ వ్యాఖ్యానించారు.

దీనిపై సీనియర్ నటుడు నాజర్ (Nasser) స్పందించారు. ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (FEFSI)ఇలాంటి రూల్స్‌ ప్రవేశపెట్టలేదని స్పష్టం చేశారు. కోలీవుడ్‌ను ఉద్దేశించి ప్రస్తుతం చక్కర్లు కొడుతోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని అన్నారు. ఒకవేళ కోలీవుడ్‌లో అలాంటి నియమాలు వస్తే.. వ్యతిరేకించే వారిలో ముందు నేనుంటానని తెలిపారు. ఇప్పుడు అంతటా పాన్‌ ఇండియా ట్రెండ్ నడుస్తోందని.. వివిధ ప్రాంతాలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్స్‌ కలిస్తేనే మంచి సినిమాలు రూపొందించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో (BRO) మూవీ రేపు భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో సాయిధరమ్ తేజ్ మెయిన్ పాత్ర చేయడం జరిగింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరి రేపు బ్రో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనేది చూడాలి.

Read Also : Bigg Boss: బిగ్ బాస్ కు హైకోర్టు షాక్, రియాల్టీ షో ఆపేయాలంటూ నోటీస్