Site icon HashtagU Telugu

Narne Nithin Engagement : పెళ్లి పీటలు ఎక్కబోతున్న జూ ఎన్టీఆర్ బావమరిది

Narne Nithin Engagement

Narne Nithin Engagement

చిత్రసీమలో వరుసగా యంగ్ హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈ మధ్య చాలామంది పెళ్లి చేసుకోగా..తాజాగా ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. ‘మ్యాడ్‌’ (MAD)సినిమాతో ఆయన ప్రేక్షకులకు పరిచమై మంచి హిట్ అందుకున్న నార్నే నితిన్‌ (Narne Nithin ) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూ.ఎన్టీఆర్‌ (Ju NTR) బావమరిది, లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) సోదరుడే నితిన్. ఆదివారం ఆయన నిశ్చితార్థం శివాని (Shivani)తో జరిగింది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్‌, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram), వెంకటేశ్‌ (Venkatesh) తదితరులు ఈ వేడుకలో సందడి చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Read Also : Sita Rama Lift Irrigation Project : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ కమిషన్ వేయాలి..? – KTR