Site icon HashtagU Telugu

Nargis Haunted House : నర్గీస్ ఫక్రి కు రాత్రిపూట అలాంటి కలలు వచ్చేవట..

Nargis Fakhri reveals

Nargis Fakhri reveals

నర్గీస్ ఫక్రీ..అంటే తెలియని సినీ లవర్స్ లేరు. అమెరికాలో పుట్టి, పెరిగిన ఈ భామ..2011 లో రాక్‌స్టార్‌(Rockstar) సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా నర్గీస్ ఫక్రి నటన, గ్లామర్ కు యూత్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత అమ్మడికి వరుస సినిమా ఛాన్సులు తలుపు తట్టాయి. అయితే అమెరికా నుండి వచ్చిన తర్వాత ముందుగా ఈమె ముంబై బాంద్రాలోని హిల్ రోల్ ఏరియాలో ఉందట. ఈమె ఉన్న రూమ్ పక్కనే స్మశాన వాటిక ఉండేదట. ఆ రూమ్ లో ఉన్నన్ని రోజులు నిద్రలేమి రాత్రులు గడిపినట్లు ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది.

షూటింగ్ ముంగించుకొని రూమ్ కు వచ్చి పడుకోగానే పిచ్చి పిచ్చి కలలు (Weird dreams) వచ్చేవట. ముఖ్యంగా ఓ వ్యక్తి వచ్చి ఆమెను స్మశానానికి (Cemetery) తీసుకెళ్లేవాడట. అక్కడ అస్థిపంజరాలు, ఎముకలను తినమని బలవంతం చేసేవాడట. ప్రతిరోజూ తనకు ఈ కల వచ్చేదట. భయంతో తెల్లవారుజామున లేచేదట. రోజూ పీడకల వెంటాడుతున్న క్రమంలో నర్గీస్ ఏకంగా ముంబై వదిలేసిందట. ఢిల్లీ (Delhi ) వెళ్ళిపోయాక ఆమెకు పీడకలలు రాలేదట. తాను ఖాళీ చేసిన ముంబై అపార్ట్మెంట్ లో చనిపోయిన పక్షి పిల్లలు కనిపించాయని వర్కర్స్ చెప్పారట. నర్గీస్ ఓ సందర్భంలో ఈ విషయాలు తెలిపింది.

ప్రస్తుతం ఈమె తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు (Harihara Veeramallu) మూవీ లో రోషనార బేగం అనే పాత్ర చేస్తుంది. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పలు కారణాలతో బ్రేక్ పడుతూ వస్తుంది. ఇప్పుడు కాదు అప్పుడు కాదు కరోనా ముందు మొదలైంది ఈమూవీ. కరోనా టైం లో షూటింగ్ బ్రేక్ పడగా..ఆ తర్వాత మొదలైనప్పటికీ పవన్ రాజకీయాలతో బిజీ గా ఉండడం, దీనికంటే వెనుక ఒప్పుకున్నా సినిమాలు చేస్తుండడం తో హరిహర వీరమల్లు మూవీ అలాగే ఉండిపోయింది.

Read Also : BRO : పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ ఫై అంబటి రాంబాబు రియాక్షన్